అక్షరటుడే, ఇందూరు: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు యువజన, క్రీడా అధికారి ముత్తెన్న తెలిపారు. ఆసక్తి గల జిల్లా ఉద్యోగులు ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని కోరారు. ఎంపికైన వారు ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.