అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో యువజన కాంగ్రెస్ రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ జాతీయ ఇన్చార్జి కృష్ణా అలవేరు హాజరు కాగా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, రూరల్ అధ్యక్షుడు మహేందర్ ఆయన్ను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల నిహార్ పాల్గొన్నారు.