అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన యువకులు శనివారం బాసరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. వసంత పంచమి పురస్కరించుకొని ఎనిమిదేళ్లుగా బాసరకు పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నట్లు వారు తెలిపారు. సందీప్, సంజీవ్, శ్రీకాంత్ తదితరులున్నారు.