అక్షరటుడే, కోటగిరి: పోతంగల్‌ మండలకేంద్రానికి చెందిన యువకులు బైక్​పై కుంభమేళాకు వెళ్లివచ్చారు. సీతలే సంతోష్, షాదుల్లా శ్రీధర్‌ బైక్​పై కుంభమేళాకు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి కాశీ వెళ్లి విశ్వానాథుడిని దర్శించుకొని శనివారం ఇంటికి చేరుకున్నారు. మొత్తం 2300 కిలోమీటర్లు బైకుపై ప్రయాణించినట్లు యువకులు తెలిపారు.