అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యూట్యూబ్‌ తన యూజర్లను ఆకర్షించేందుకు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. స్లీప్‌ టైమర్‌, రీసైజబుల్‌ మినీ ప్లేయర్‌, ఫేవరేట్‌ ప్లే లిస్ట్‌ ఇలా పలు ఫీచర్లను యాడ్‌ చేసింది. ఫీచర్ల విషయానికొస్తే.. రాత్రివేళ చాలామంది యూట్యూబ్‌ను చూస్తూ నిద్రలోకి జారుకుంటారు. దీంతో ఫోన్‌లో డాటా అయిపోతూ ఉంటుంది. దీనికి పరిష్కారంగా స్లీప్‌ టైమర్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీంట్లో టైమ్‌ని సెట్‌ చేసుకుంటే ఆ టైమ్‌కి వీడియో ఆగిపోతుంది. వీడియో ప్లే చేశాక స్క్రీన్‌పై సెట్టింగ్స్‌ ఐకాన్‌ని ట్యాప్‌ చేస్తే స్లీప్‌ టైమర్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. మరో ఫీచర్‌లో ప్లే లిస్ట్‌ను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నచ్చిన వ్యక్తులకు పంపే సదుపాయాన్ని తీసుకొచ్చింది.