అక్షరటుడే, వెబ్డెస్క్: ఏపీలో వైసీపీ అధ్యక్షుడు జగన్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవ్వలేదు. ప్రస్తుతం నిర్ణయాన్ని మార్చుకుని అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం శాసనసభకు హాజరుకానున్నట్లుసమాచారం. సోమవారం గవర్నర్ ప్రసంగానికి వీరంతా హాజరవనున్నట్లు తెలుస్తోంది.