అక్షరటుడే, జుక్కల్: జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ను నూతనంగా ఎన్నికైన పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డిలు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఏఎంసీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లను ఎంపీ అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అడ్వకేట్ రాం రెడ్డి, గుర్రపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.