ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహేష్ కుమార్ గౌడ్

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. నిజామాబాద్ కు చెందిన సీనియర్ నేత, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం కల్పించారు. బల్మూర్ వెంకట్ ను సైతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. ఎన్ఎస్ యూఐ నేత నుంచి క్రియాశీలక నేతగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి పార్టీకి విదేయుడిగా ఉన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ స్థానాన్ని వదులుకొని షబ్బీర్ కు అవకాశం ఇచ్చారు. దీంతో అధిష్ఠానం ఆయనకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈనెల 18లోగా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాల్సి ఉండగా.. 29న ఎన్నిక జరగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా రెండు స్థానాలను కూడా హస్తం పార్టీ కైవసం చేసుకోనుంది. దీంతో పార్టీ ప్రకటించిన ఇద్దరు అభర్థులు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడం లాంఛనమే కానుంది.