అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మేయర్ నీతూకిరణ్ సూచించారు. బుధవారం తన ఛాంబర్లో మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాలనీల్లో చెత్త సేకరణ పక్కాగా జరగాలని, నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వాహనాలను విధిగా కాలనీల్లో తిప్పాలని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళి మోహన్‌రెడ్డి, ఇంజినీర్లు మురళి, శంకర్, సల్మాన్‌ఖాన్, ఇన్చార్జి ఎంహెచ్వో సాజిద్‌అలీ పాల్గొన్నారు.