అక్షరటుడే, ఇందూరు: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను పెండింగ్ లో పెట్టవద్దని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కారం చూపించాలన్నారు. అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, ఏసీపీ కిరణకుమార్ తదితరులు పాల్గొన్నారు.