అక్షరటుడే, ఎల్లారెడ్డి : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. లింగంపేట మండలం మెంగారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల విడుదలైన రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారు గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ నరేందర్, సొసైటీ వైస్ ఛైర్మన్ రాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాగౌడ్, బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.