అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ నగరంలో కుక్కల బెడద నివారణకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కాలనీల్లో కుక్కల బెడద ఉంటే 08462-220234 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా అధికారులు నగరంలోని వివిధ కాలనీల్లో యానిమల్ బర్త్ కంట్రోల్ టీంలను రంగంలోకి దించారు. బృందాల సభ్యులు వీధుల్లోని శునకాలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు.