అక్షరటుడే, ఆర్మూర్: ఆర్టీసీ బస్టాండ్ లో ఓ బాలుడు కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపింది. భీంగల్ కు చెందిన దంపతులు ఆదివారం సాయంత్రం బస్సు ఎక్కుతుండగా.. వారితో పాటు ఉన్న బాలుడు గగన్ సిద్దార్థ్ అదృశ్యమయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సు ఎక్కేక్రమంలో రద్దీ ఎక్కువగా ఉండగా.. ఆ సమయంలో సాలుర కు చెందిన వృద్ధురాలు బాలుడిని కిడ్నాప్ చేసింది. అనంతరం వరంగల్ వెళ్ళే బస్సులో సిద్ధార్థ్ ను తీసుకెళ్ళింది. ప్రయాణికులకు అనుమానం వచ్చి బస్సును కమ్మర్పల్లి పీఎస్ వద్ద ఆపివేశారు. పోలీసులు వృద్ధురాలిని విచారించగా బాలుడిని ఆర్మూర్ బస్టాండ్ లో కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకుంది. అనంతరం ఆర్మూర్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.