Advertisement
అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని న్యాల్కల్ రోడ్డులో పట్టపగలు చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో దాదాపు రూ.5 లక్షల సొత్తును అపహరించుకెళ్ళారు. వివేకానంద కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుమార్ అతని భార్య శ్యామల శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళారు. మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా తాళం ధ్వంసం చేసి ఉంది. అనంతరం చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో దాచి ఉంచిన అయిదు తులాల బంగారు నగలు, రూ.లక్షన్నర నగదు అపహరించుకెళ్ళారు.
Advertisement