Advertisement
అక్షరటుడే, బాసర: వసంత పంచమి వేడుకల్లో భాగంగా బాసరలో భక్తులు బారులు తీరారు. బుధవారం వేకువ జామున నుంచి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. 108 కళాశాలతో మహాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సరస్వతీదేవి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జ్యోతి, ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.


Advertisement