యువకుడి దారుణ హత్య

Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని న్యాలకల్ రోడ్డులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సీతారాంనగర్ కాలనీకి చెందిన శ్రావణ్ కుమార్(35)ను స్మార్ట్ సిటీ వెంచర్ లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అయిదో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు ఖలీల్వాడిలోని శ్రీవిష్ణు ప్రైవేటు ఆస్పత్రిలో కంపౌండర్ గా పని చేస్తున్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  MLC Kavitha | పసుపు రైతుల ఆందోళనలు కనిపించడం లేదా?
Advertisement