మాదకద్రవ్యాల నిరోధానికి కృషి చేయాలి

0

అక్షరటుడే, కామారెడ్డి: మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు రవాణా కాకుండా చూడాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీడబ్ల్యూవో అధికారి బావయ్య, జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, ఇతర అధికారులు పాల్గొన్నారు.