రేవంత్‌, కవిత ఇద్దరూ ఒక్కటే..

0

అక్షరటుడే, బోధన్‌: సీఎం రేవంత్‌, ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ ఒక్కటేనని ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యానించారు. వారిద్దరూ కలిసే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తరపున నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. గురువారం బోధన్‌లోని నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు. అనంతరం అర్వింద్‌ విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీతోనే ఈ ప్రాంత చెరకు రైతులకు లబ్ధి జరుగుతుందని, దేశంలోని 66 షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించింది కేంద్రమేనని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరుద్ధరణ కమిటీ పేరిట కాలయాపన చేస్తుందని విమర్శించారు. బోధన్‌ ప్రాంత చెరకు రైతులు ఆ పార్టీని నమ్మవద్దన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కుల, డబ్బు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతోనే నిజాంషుగర్స్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తుందని ఎంపీ తెలిపారు.