అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే నిరుపేద ఎస్సీ విద్యార్థులు పథకానికి అర్హులని పేర్కొన్నారు. అక్రిడిటేషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్, పాస్‌పోర్టు, వీసా కలిగి ఉండాలన్నారు. జీఆర్‌ఈ, టోఫెల్ స్కోర్‌తో పాటు డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. దరఖాస్తుకు మార్చి 31వ తేదీ ఆఖరు అని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ ఈపాస్ అధికారిక వెబ్ సైట్లో సంప్రదించాలని సూచించారు.
ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement