Advertisement
అక్షరటుడే, బాల్కొండ: కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా పీడీఎస్ నిల్వలను సీజ్ చేశారు. వేల్పూర్ మండలంలోని వజ్ర రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం నిల్వలు ఉన్నాయనే సమాచారంతో శనివారం రాత్రి తనిఖీలు జరిపారు. సుమారు 120 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వేల్పూర్ పోలీసులకు అప్పగించారు.
Advertisement