Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ సమక్షంలో ఆయన సీఎంను కలుసుకున్నారు. సిట్టింగ్ స్థానం వరంగల్ నుంచి తనకు మరోసారి టికెట్ లభిస్తుందని పసునూరి ఆశించారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం కడియం కావ్యకు అవకాశం ఇవ్వడంతో దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎంను కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు మొదలయ్యాయి.
Advertisement