అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: రైలుకింద పడి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. నగరంలోని గౌతంనగర్‌కు చెందిన ఇంద్రాల శ్రీనివాస్(56) ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఇంట్లో గొడవ జరగడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మిర్చి కాంపౌండ్ రైల్వే గేట్ సమీపంలో జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.