అక్షరటుడే, వెబ్‌డెస్క్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ వరకు గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల నోటిఫికేషన్ విడుదల కాగా.. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ సారి టెట్ అప్లికేషన్లు భారీగా తగ్గడంతో.. దరఖాస్తుకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెట్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో జరుగనున్నాయి.