అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ముండ్లమారు మండలంలో సెకను పాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ముండ్లమారు, సింగన్నపాలెం, మారెళ్లలో భూమి కంపించినట్లు సమాచారం. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం ప్రకాశం జిల్లాలో ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే.