అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు సోమవారం ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టులోకి వెళ్తున్న సమయంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ.. బయట బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే.. సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.. అడిగిన ప్రశ్నల్నే రెండేళ్లుగా అడుగుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత జ్యూడీషియల్‌ రిమాండ్‌ను కోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. దీంతో ఆమెను తీహార్‌ జైలుకు తరలించారు.