అక్షరటుడే, వెబ్ డెస్క్: లాస్ ఏంజెల్స్ అడవి మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గాలి వేగం ఎక్కువగా ఉండటం, నీటి కొరత వంటి సమస్యల కారణంగా మంటల్ని అదుపులోకి తేవాడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనుభవజ్ఞులైన రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బంది సహాయం కూడా కోరుతున్నారు.

ఐదుగురు మృతి..

లాస్ ఏంజెల్స్ పరిసర ప్రాంతాల్లో.. ముఖ్యంగా పాలిసేడ్స్, ఈటన్, హర్స్ట్ వంటి ప్రాంతాల్లో గాలి వేగం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. ఆకాశం పొగతో కమ్ముకుని పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ మంటల వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 1,000 కంటే ఎక్కువ భవనాలు దగ్ధమయ్యాయి. వేలాది మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు. 70,000 మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు.