అక్షరటుడే, వెబ్డెస్క్: సంక్రాంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో మొదలయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు సోమవారం భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకున్నారు. తమ లోగిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. ఆ తర్వాత తమ ఇళ్ల వద్ద రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు.
నిజాంసాగర్ మండలంలోని మాగి చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగుల కాలనీలో..
నగరంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో..