అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ పందెం కోడి రూ. 1.25 కోట్లు గెలుచుకుంది. ఓ వేదికగా సాగిన పోటీలో గుడివాడ ప్రభాకర్ రావు, రాతయ్య.. నెమలి పుంజు, రసంగి పుంజులను బరిలో దింపారు. హోరాహోరీగా సాగిన పందెంలో గుడివాడ ప్రభాకర్ కు చెందిన నెమలి పుంజు గెలిచింది. కోటి రూపాయల కోడి పందాన్ని వీక్షించేందుకు పందెంరాయుళ్లు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కాగా రూ.కోటికి పైగా నగదు గెలుచుకున్న కోడిని అందరూ ప్రశంసిస్తున్నారు.