అక్షరటుడే, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాయీ బ్రాహ్మణ సంఘ భవనంలో శనివారం పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, ఎన్నికల అధికారి లింగంపెల్లి కిషన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా గుంజాల చైతన్య, పట్టణ అధ్యక్షుడిగా సెరాల నరేష్, ప్రధాన కార్యదర్శిగా లింగంపెల్లి నవీన్, ఉపాధ్యక్షులుగా గుంజలా గజేందర్, ఓల్లూరి గంగాధర్, సహా కార్యదర్శులుగా సందీప్, తిరుపతి, కోశాధికారిగా గుంజల రమేష్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు మరుకంటి జీవన్, శ్రీకాంత్, కిష్టయ్య, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.