అక్షరటుడే, కామారెడ్డి: తనకు కమీషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని భిక్కనూరు ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు కైరంకొండ ఆంజనేయులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాను 2018 డిసెంబర్లో గ్రామంలో సర్వీస్ పాయింట్ పెట్టుకున్నట్లు చెప్పారు. 2020 నుంచి కమీషన్ డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్బీవో సమావేశంలో కమీషన్ విషయం అడిగితే ఏమైనా చేసుకోండని మాట్లాడారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.