అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. శనివారం నగరంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిదిన్నరేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజలకు అవస్థలు తప్పడం లేదన్నారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. మళ్లీ పసుపుబోర్డు పేరుతో ఓట్లు దండుకుందామని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, విశాలిని రెడ్డి, అరవింద్ సింగ్, భాస్కర్, సుజిత్ సింగ్ ఠాగూర్, సత్య ప్రకాశ్, రవి చందర్ పాల్గొన్నారు.