అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియాలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. అధికారిక వర్గాలు ఈ ప్రమాదాన్ని “మేజర్ ఇన్సిడెంట్”గా పేర్కొన్నాయి. ఉత్తర ఫిలడెల్ఫియాలోని కాట్మన్ బస్టెల్టన్ ప్రాంతంలో రూస్ వెల్ట్ మాల్ కు దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాయి. వాషింగ్ టన్ డీసీలో విమానం, హెలికాఫ్టర్ ఢీకొన్న ఘటన మరవక ముందే మరో ఫ్లైట్ క్రాష్ కావడం గమనార్హం. వాషింగ్టన్ ఘటనలో 67 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.