అక్షరటుడే, కామారెడ్డి: ద్విచక్ర వాహనదారులు అధిక శబ్దం చేసే సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి హెచ్చరించారు. ఇటీవల సౌండ్ పొల్యూషన్ చేస్తున్న బైక్ లకు సంబంధించిన 65 సైలెన్సర్లను సీజ్ చేశారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద రోడ్డు రోలర్ తో వాటిని ధ్వంసం చేయించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీరామ్, ట్రాఫిక్ ఎస్సై మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.