అక్షరటుడే, న్యూఢిల్లీ: భారత్ లోని మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు యాపిల్ కంపెనీ 16ఈను లాంచ్ చేసింది. భారత్ లో కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 16ఈ ధర రూ. 59,900 ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రీ-ఆర్డర్లు నేడు (ఫిబ్రవరి 21న) ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 28 నుంచి డెలివరీ అవుతాయి.
ఎన్నో ప్రత్యేకతలు..
- 6.1 ఓఎల్ఈడీ డిస్ప్లే
- యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్
- యాపిల్ ఏ18 చిప్ ఆధారంగా పని చేస్తుంది. ఈ చిప్ సెట్ సిక్స్ సీపీయూతో వస్తుంది. ఆపిల్ ఐఫోన్ 11కి శక్తినిచ్చిన ఏ13 బయోనిక్ చిప్ కంటే ఏ-18 చిప్ 80 శాతం వేగంగా ఉంటుంది.
- 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఈ ఫోన్ ప్రత్యేకత
- సింగిల్ 48 ఎంపీ జన్ బ్యాక్ కెమెరా, కెమెరా సిస్టమ్ 2Ex టెలిఫొటో జూమ్ అందిస్తుంది. వివిధ
- ఆటోఫోకస్‌తో కూడిన 12 ఎంపీ ట్రూ డెప్ట్ కెమెరా
- 4కే వీడియో రికార్డింగ్, డాల్బీ విజన్
- 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్
- మెసేజెస్ వయా శాటిలైట్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ వంటి ఉపగ్రహ కనెక్టివిటీలు