అక్షరటుడే, బోధన్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాల్ థాకరే జయంతి సందర్భంగా గురువారం బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు లోకేష్, పుసులేటి గోపి, విద్యావికాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.