Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని ఓ పాత ఇనుప సామగ్రి దుకాణంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణం వెనుక భాగంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో దట్టమైన పొగలు వచ్చాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందజేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో ఇతర ప్రాంతాలకు అగ్నికీలలు వ్యాపించకుండా నివారించగలిగారు. దీంతో చుట్టుపక్కల నివాసాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో భారీ నష్టాన్ని సైతం నివారించారు.
Advertisement