అక్షరటుడే, వెబ్‌డెస్క్: అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. హ్యూస్టన్ లో టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి బయటకు పంపించడంతో సురక్షితంగా బయటపడ్డారు. విమానం ఇంజన్‌లో సమస్య రావడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఇటీవల అమెరికాలో రెండు విమాన ప్రమాదాలు జరిగాయి. మళ్లీ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది.