అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఐదో టౌన్ పరిధిలో గల ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్ పోలీసులు దాడులు జరిపి పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు మహమ్మదీయ నగర్ లోని ఫ్యాక్టరీలో దాడి చేసి 40 బ్యాగుల బియ్యం పట్టుకున్నట్లు సీఐ అంజయ్య పేర్కొన్నారు. అనంతరం పట్టుబడిన బియ్యాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు.