అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని శనివారం వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, నాయకులు మోహన్ నాయక్, నార్ల సురేష్, ఎజాజ్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీధర్, గురు వినయ్ పాల్గొన్నారు.