అక్షరటుడే, ఆర్మూర్‌: కాంగ్రెస్‌ పార్టీ బుట్టచోర్‌ మాటలు, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. సోమవారం భీమ్‌గల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలపై గ్రామాల్లో ప్రజలు ఆ పార్టీ నాయకులను నిలదీయాలన్నారు. ‘కల్యాణలక్ష్మి’ కింద అదనంగా ఇస్తామన్న తులం బంగారం, నిరుగ్యోగ భృతి, మహిళలకు పెన్షన్‌, రైతు రుణమాఫీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. పసుపు బోర్డు పేరిట రైతులను మోసం చేశారని మండిపడ్డారు.

నేను పక్కా లోకల్‌..

తన రాజకీయ ఎదుగుదలకు సిరికొండ, బాల్కొండ ప్రాంత ప్రజలే కారణమని బాజిరెడ్డి పేర్కొన్నారు. సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే వరకు ఈ ప్రాంత ప్రజలు గెలిపించుకున్నారని తెలిపారు. తాను పక్కా లోకల్ అని.. బులెట్టు దిగినా.. ప్రాణాలకు తెగించి నిలబడిన వ్యక్తినని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.