ఎమ్మెల్సీ కవితకు మరో షాక్‌

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఆమెను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం ఇందుకు అనుమతించింది. విచారణకు వెళ్లే రోజు విధిగా కోర్టుకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సీబీఐకి సూచించింది. అధికారులు ల్యాప్‌టాప్‌, ఇతర స్టేషనరీ వెంట తీసుకెళ్లవచ్చని చెప్పింది. కవితను విచారించే సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు అక్కడే ఉండాలని షరతు విధించింది. మరోవైపు కవిత బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ వేయగా.. గురువారం వాదనలు జరిగాయి. ఆమెకు బెయిల్‌ ఇవ్వకూడదని ఈడీ కోర్టును కోరింది. బెయిల్‌ ఇచ్చినట్లయితే ఆమె ఆధారాలను, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించింది.