ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి

Advertisement

అక్షరటుడే, ఇందూరు: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇందల్వాయి, తిర్మన్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌తో కలిసి శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ధాన్యానికి తరుగు తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని వారు సమాధానమిచ్చారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంకు, రాష్ట్రస్థాయిలో అందుబాటులో ఉన్న టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపులో జాప్యానికి తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట డీసీవో ఎన్‌.శ్రీనివాస్‌ రావు, డీఎస్‌వో చంద్రప్రకాశ్‌, సివిల్‌ సప్లయ్స్‌ డీఎం జగదీశ్‌ తదితరులున్నారు.

Advertisement