అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతును గెలిపించుకుందామని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. శుక్రవారం నగరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో 50 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించిందన్నారు. ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు రోడ్డున పడ్డారని, కరెంట్ కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు. తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్, నాయకులు దండు శేఖర్, సంతోష్, ప్రభాకర్‌రెడ్డి, సుజిత్‌సింగ్, సత్యప్రకాశ్, నరేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.