పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇందుకు వీలుగా వారికి ఫారం-12డీలను పంపిణీ చేయిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా బూత్‌ లెవెల్‌ అధికారులు సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగ ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఫారాలను అందజేస్తున్నారని చెప్పారు. జిల్లా పరిధిలో సీనియర్‌ సిటిజన్లు 7,555 మంది ఉండగా.. మార్చి 30 నాటికే 3,331 మందికి ఫారాలు అందజేశామన్నారు. దివ్యాంగ ఓటర్లు 24,229 మంది ఉండగా.. 10,175 మందికి ఫారాలను సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఇంటి నుంచి ఓటు వేయాలనుకునే వారు ఈ నెల 20వ తేదీ వరకు ఫారాన్ని అందజేయాలన్నారు. అనంతరం పోలింగ్‌ అధికారుల బృందాలు వారి ఇళ్లకు వెళ్లి పారదర్శకంగా ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తాయని చెప్పారు.

Advertisement
Advertisement