వీధి కుక్కల దాడి.. తీవ్రంగా గాయపడ్డ ఏడేళ్ల బాలిక

అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికపై వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం తండాలో చేటుచేసుకుంది. తండాకు చెందిన రాజేశ్‌, జ్యోతి దంపతుల కుమార్తె శైలజ(7) ఇంటి వద్ద ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. బాలిక అరుపులు విన్న కుటుంబీకులు హుటాహుటిన చేరుకుని కుక్కలను చెదరగొట్టారు. బాలిక నుదిటిపై తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

Advertisement
Advertisement
Advertisement