అక్షరటుడే, ఎల్లారెడ్డి: పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఎల్లారెడ్డి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పదేళ్లుగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాటిల్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. గత పదేళ్లలో ఒక్క అవినీతి మచ్చలేని నాయకుడు బీబీ పాటిల్ అని పేర్కొన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవేందర్, పార్టీ మండలాధ్యక్షుడు నర్సింలు, సతీశ్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఎన్ రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.