అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో ఓ వైద్యుడు రోగులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం డాక్టర్‌ దీపక్‌ రోగులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారి బంధువులపైకి కుర్చీ ఎత్తాడు. అంతేకాకుండా రోగి చార్జిషీటును చించిపడేశాడు. దీంతో రోగులు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వైద్యుడిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ తెలిపారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Congress Banswada | మంత్రిని కలిసిన బాన్సువాడ నాయకులు