అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని నిజామాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రూ. రెండు లక్షల రుణమాఫీ, క్వింటాలుకు రూ. 500 బోనస్, ఎకరానికి రూ.15వేల రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా వాటి ఊసెత్తడంలేదని పేర్కొన్నారు. అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు. మరోవైపు ఈ నిరసన దీక్షకు అర్బన్ నేతలు దూరంగా ఉన్నారు. మేయర్ నీతూ కిరణ్ సహా పలువురు గులాబీ నేతలు హాజరుకాలేదు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, బీఆర్‌ఎస్ నగరాధ్యక్షుడు సిర్పరాజు, నాయకులు సూదం రవి చందర్, సుజీత్ సింగ్ ఠాకూర్, ఎనగందుల మురళి తదితరులు పాల్గొన్నారు.