అక్షరటుడే, జుక్కల్ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం మద్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్‌ స్టేషన్‌ నిర్వహణ, రికార్డులు, ఆయుధాలు, పోలీసు వాహనాలు, కేసుల వివరాలు, రిజిస్టర్ల నిర్వహణపై వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన అమరవీరుడి కుటుంబాన్ని బిచ్కుంద సీఐ నరేష్ పరామర్శించారు.