అక్షరటుడే, ఆర్మూర్: అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానాన్ని ఆమోదించడంతో మంగళవారం ఆర్మూర్‌లో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా, జిమ్మి రవి, భగత్, అభినవ్‌రాజ్, భూపేందర్, చిట్టిరెడ్డి, రవి, మురళి, మీసాల రవి పాల్గొన్నారు.